Pages

Sunday 18 January 2015

నమస్తే తెలంగాణా పేపర్ లో వచ్చిన డాక్టర్ కాలువ మల్లయ్య గారి తప్పు తొవ్వ


ఈ రోజు (18th January, 2015) నమస్తే తెలంగాణా పేపర్ లో వచ్చిన డాక్టర్  కాలువ మల్లయ్య గారి “ఏది అభ్యుదయం? ఏది నిరంకుశం?” అనే వ్యాసం చుసిన తరువాత మన దగ్గర ఇంకా కొంత మంది ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు అని అర్థం అవుతంది.
మొదటగా ఈ కింది వ్యాసాన్ని జర ఒపిగగా చదవండి…
Kaluva Malliah

జంబూ ద్వీపానికి వలస వచ్చి భారత సంతతికి చెందిన ఆదిమ భారతీయులను జయించి ద్రవిడులుగా, దస్యులుగా ముద్రవేసి దేశాన్ని ఆక్రమించుకుని పాలకులుగా మారిన మొట్టమొదటి విదేశీయులు ఆర్యులు.

అయ్యా ! బ్రిటిష్ వాళ్ళు ప్రతిపాదించిన ఆర్య సిద్ధాంతం తప్పు, ఒక మోస పూరిత విషం అని తేలిన తరువాత గూడా దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం ఎంత వరకు సమంజసం.
ఈ కింది లింక్ ను క్లిక్ చేసి చదవండి.

Aryan-Dravidian divide a myth: Study

మీరు అ తప్పును ఆదరంగా చేసుకొనే మొత్తం వ్యాసం మీకు నచ్చిన విధంగా రాసుకున్నారు….ఏమనాలి దీన్ని? 

“ఆంగ్లేయుల చరిత్రను ప్రజాస్వామికమైనదిగా ముస్లింల చరిత్రను అభివృద్ధి నిరోధకంగా చిత్రించారు.”…

అయ్యా! ….ఎవరు ప్రజాస్వామికమైనదిగా అన్నారో తెలుసుకోవాలని ఉంది

“ప్రపంచాన్నే ప్రభావితం చేసిన బౌద్ధధర్మాన్ని ఆర్య సంతతి వారు భారత దేశం నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ముస్లింలు చేయలేదు.”

ఓహ్ పెద్ద మనిషి ! అంత పెద్ద బుద్ధ విగ్రహాన్ని ఆఫ్గనిస్తాన్లో బాంబులు పెట్టి పేల్చింది గూడా ఆర్య సంతితి వారెన? బౌద్ద ధర్మాన్ని పాటించే దైల లామా కు బారత దేశంలో ఎన్ని రోజులైనా ఉండవచు అని చెప్పింద్ది ఆర్య సంతతి వారెన ?

“తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, భాషలను కూడా ఆంగ్లేయుల, సీమాంధ్రుల దృష్టికోణం లోంచే మూల్యాంకనం చేశారు.”..
మరి ఆర్య సిద్ధాంత గూడా బ్రిటిష్ వారి దృష్టికోణం లోంచే మూల్యాంకనం చేశారు అనడంలో ఏమైనా తప్పు ఉందా?

  నైజాం పాలన తెలంగాణ చరిత్రను ఆంగ్లేయుల కోణంలోంచి కాకుండా తెలంగా ణ ముస్లింల దృష్టికోణం లోంచి చూడాలి.
ప్రతి పల్లె పల్లె చెప్పుతుది నైజం పాలనా ఎంత రాక్షస మైనది అని …..

రాజులందరూ ఫ్యూడలే! వాళ్లను మతపరంగా చూడడం సరైంది కాదు.
అయ్యా ! హైదరాబాద్ సంస్థానాన్ని ఇస్లాం రాజ్యాంగ పరిపాలన చేయడం మత పరంగా చూడద్దా ?
“నిజాం కాలంలో మత స్వేచ్ఛతో పాటు మతకలహాలు లేవు.”
అయ్యా ! మీకో దండం… ఇంత పెద్ద అబద్ధాన్ని చాల అలకగా చెప్పినందుకు
నైజాం పాలనలోని చివరి నాలుగైదు సంవత్సరాల్లో రజాకార్ల విజృంభణా కాలంలో జరిగిన దౌర్జన్యాలను మినహాయిస్తే నిజాం పాలన ఏ ఇతర రాజుల పాలనకూ తీసిపోదు.
అయ్యా! జర ఇంతకు ముందు రాసిన  “ రాజకీయ నాయకుల దృష్టిలో నిజాం పాలనలో దొర్లిన చిన్న, చిన్న, అతి సాధారణమైన తప్పులు” కొద్దిగా చదవగలరు…..
 
ఒహ సారూ ! మీరు రాసిన వ్యాసం తెలంగాణా మేలు చేసే టట్లు నైకైతే కానోతల్లేదు……. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...